logo

కొలువు వీడని పాలకవర్గాలు

ప్రభుత్వం మారిన సందర్భంలో గత ప్రభుత్వం నియమిత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కమిటీలు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేయాల్సి ఉంది.

Published : 22 Jun 2024 05:29 IST

మొగల్తూరు, నరసాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వం మారిన సందర్భంలో గత ప్రభుత్వం నియమిత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కమిటీలు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేయాల్సి ఉంది. అలా ఏర్పాటైన కమిటీలు రాజీనామా చేయకుంటే నూతన ప్రభుత్వం వాటిని రద్దుచేసే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయి పక్షం రోజులు గడిచింది. వైకాపా ప్రభుత్వం ఘోర పరాజయం పాలైంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో తెదేపా ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కావస్తోంది. గత ప్రభుత్వంలో నియామకం పొందిన దేవాలయాల పాలకవర్గ కమిటీల్లో పలు కమిటీలు నేటికీ రాజీనామా చేయలేదు. దీంతో తెదేపా, దాని మిత్రపక్ష జనసేన, భాజపాలకు చెందిన ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం పార్టీలోని అసంతృప్తులను ప్రసన్నం చేసుకోవడానికి ఆగమేఘాలపై ట్రస్టుబోర్డులు ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి చెందిన పలువురికి ఆ బోర్డుల్లో ఛైర్మన్లు, సభ్యులుగా నియమిత ప్రాతిపదికన రాజకీయ ఉద్యోగం కల్పించారు. ప్రభుత్వం మారినా పలువురు నేటికీ రాజీనామాలు సమర్పించకుండా కొనసాగుతున్నారు.

నేరుగా నివేదికలు  ఆయా ఆలయ పాలకవర్గ కమిటీలు అందించే రాజీనామా పత్రాలను ఆలయాల ఈవోలు నేరుగా ఆర్జేడీ, కమిషనర్‌ కార్యాలయాలకు నివేదిస్తారు. స్వచ్ఛందంగా రాజీనామా చేయని కమిటీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 సీహెచ్‌ రంగారావు, ఇ.సుబ్బారావు, ఏసీ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా   

    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని