logo

మన్యంలో కుండపోత

పోలవరం, వేలేరుపాడు, టి.నరసాపురం మండలాల్లో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. పోలవరం తహసీల్దార్‌ కార్యాలయంలో 59.8 మి మీ వర్షపాతం నమోదైంది.

Published : 24 Jun 2024 04:06 IST

కొత్తపట్టిసీమలో వర్షపు నీటిలో వీధి

పోలవరం, వేలేరుపాడు, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: పోలవరం, వేలేరుపాడు, టి.నరసాపురం మండలాల్లో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. పోలవరం తహసీల్దార్‌ కార్యాలయంలో 59.8 మి మీ వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి కొద్దిపాటి చినుకులతో ప్రారంభమై ఏకధాటిగా కురిసింది. పోలవరం, పట్టిసీమ, కొత్తపట్టిసీమ, గూటాల పంచాయతీల పరిధిలోని వీధులు జలమయమై.. ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. పోలవరంలో కమ్మరగూడెం, బాపూజీకాలనీకి వెళ్లే మార్గంలో గోతుల్లో నీరు నిలవడంతో కొట్టుకొచ్చిన చేపలను పట్టుకోవడానికి స్థానికులు ఎగబడ్డారు. నెక్లెస్‌బండ్‌ను ఆనుకుని నీరు నిలిచింది.  
ఇళ్లలోకి నీరు  వేలేరుపాడు మండలంలోని  వేలేరుపాడు, ఎర్రబోరు, జగన్నాథపురం, రుద్రంకోట,  టి.నరసాపురం మండలం బొర్రంపాలెం, తిరుమలదేవిపేట, టి.నరసాపురం తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో రహదారులపై నీటి నిల్వలు, ప్రవాహాలు అధికం అవడంతో రహదారులు కోతకు గురై ఇళ్లలోకి నీరు చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్వారకాతిరుమల వసంతనగర్‌ కాలనీలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి రేకుల షెడ్డు కూలింది. 

జీలుగుమిల్లిలో 97.6 మి.మీ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్యలో 35.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైందని సీపీవో జి.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జీలుగుమిల్లి మండలంలో అత్యధికంగా 97.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు (మి.మీ) ఇలా... బుట్టాయిగూడెం 94.4, నిడమర్రు 92.8, కొయ్యలగూడెం 84.6, చింతలపూడి 84.2, జంగారెడ్డిగూడెం 79.4, పోలవరం 59.8, ఉంగుటూరు 5.0., వేలేరుపాడు 50.0, కామవరపుకోట 41.4, టి.నరసాపురం 38.2, ద్వారకాతిరుమల 38.0, నూజివీడు 32.4, లింగపాలెం 28.6, కుక్కునూరు 25.2, ముసునూరు 24.8 

తిరుమలదేవిపేటలో ఇళ్లలోకి చేరిన నీరు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని