logo

ధాన్యం రుణం రూ.3,200 కోట్లు దారి మళ్లింపు

ధాన్యం సొమ్ము చెల్లింపు పేరుతో వైకాపా ప్రభుత్వం రూ.3,200 కోట్లు రుణం తీసుకొని రైతులకు నగదు జమ చేయకుండా దారి మళ్లించిందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు.

Published : 24 Jun 2024 04:25 IST

వైకాపా తీరుతో రైతులకు అవస్థలు: పితాని

మాట్లాడుతున్న సత్యనారాయణ 

కొముచిక్కాల(పోడూరు), న్యూస్‌టుడే: ధాన్యం సొమ్ము చెల్లింపు పేరుతో వైకాపా ప్రభుత్వం రూ.3,200 కోట్లు రుణం తీసుకొని రైతులకు నగదు జమ చేయకుండా దారి మళ్లించిందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. ఆదివారం కొమ్ముచిక్కాలలోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సొమ్ములు జమ కాక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవమన్నారు. గత ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ధాన్యం సేకరణ చేసి ఈ రోజుకు కూడా రూపాయి ఇవ్వకుండా కర్షకులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు, రైతులు చూడలేరన్నారు. దీంతో రబీ పెట్టుబడి సొమ్ములు రాక బ్యాంకు రుణాలకు వడ్డీ కట్టలేక, ప్రస్తుతం సార్వాకు పెట్టుబడి పెట్టలేక రైతుల పడుతున్న అవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ దృష్టికి తీసుకెళ్తే అక్రమాలు వెలుగు చూశాయన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. జులై మొదటివారం నుంచి బకాయిల చెల్లింపులు చేస్తామని, కొద్దిరోజులు ఓపిక పట్టాలని రైతులను కోరుతున్నామన్నారు. 15 రోజుల్లో పూర్తి బాధ్యత తీసుకొని బకాయిలు చెల్లిస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని