logo

నేటి నుంచి పరిష్కార వేదిక

ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించేందుకు వైకాపా పాలనలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమం పేరును ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా మారుస్తూ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Published : 24 Jun 2024 04:28 IST

వినతులు స్వీకరిస్తున్న అధికారులు(పాతచిత్రం) 

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించేందుకు వైకాపా పాలనలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమం పేరును ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా మారుస్తూ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. ఒకప్పుడు ప్రజావాణి పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వైకాపా పాలకులు ‘స్పందన’గా మార్చారు. గత అయిదేళ్లలో ఈ ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారిందనే విమర్శలున్నాయి. న్యాయం జరుగుతుందనే ఆశతో ప్రజలు దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చేవారు. చిన్నచిన్న సమస్యలు మినహా దీర్ఘకాలిక అంశాలకు పరిష్కారం లభించిన దాఖలాలు లేవు. వైకాపా నేతల ప్రచార ఆర్భాటం తప్ప దీని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇకపై ఇలాంటి పరిస్థితిలో మార్పు వస్తుందని అభిప్రాయం ప్రజలు, అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. అర్జీల వివరాలను ‘మీ కోసం’ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు సమస్యల్ని వేగంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీఆర్వో ఉదయభాస్కరరావు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని