logo

వారు వెళ్లిపోయినా.. వీరు వీడలేకపోతున్నారు!

కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పాత పాలకవర్గాలు రద్దయ్యాయి. అయిదేళ్లపాటు వైకాపా నాయకులతో అంటకాగిన కొందరు అధికారులు మాత్రం వారు వెళ్లిపోయినా వారి ఆనవాళ్లను వదల్లేకపోతున్నారు.

Updated : 26 Jun 2024 04:46 IST

పాత కమిటీ పేర్లనే కొనసాగిస్తున్న అధికారులు

పాలకొల్లు, పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. పాత పాలకవర్గాలు రద్దయ్యాయి. అయిదేళ్లపాటు వైకాపా నాయకులతో అంటకాగిన కొందరు అధికారులు మాత్రం వారు వెళ్లిపోయినా వారి ఆనవాళ్లను వదల్లేకపోతున్నారు. పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయ అధికారుల తీరు ఈ కోవలోనే సాగుతుంది. ఆలయ కమిటీలు రాజీనామా చేసినా నేటికీ వారిపేరుతో ఉన్న ఫ్లెక్సీలు, చిత్రాలే ఆలయ కార్యక్రమాలకు కొనసాగించడం విమర్శలకు దారితీస్తుంది. ఇటీవల నిర్వహించిన చండీ హోమం సందర్భంగా పాత ఆలయ కమిటీ పేరుతో ఉన్న ఫ్లెక్సీనే పూజల దగ్గర పెట్టడం అధికారుల తీరుకు అద్దం పడుతుంది. ఆలయం లోపల పలు ప్రదేశాల్లో నూ పాత ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని