logo

అయ్యో.. పాపం

ఓ విద్యార్థిని ఫిట్స్‌తో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరి మృతి చెందిన ఘటన పోడూరు కల్నల్‌ డీఎస్‌రాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

Published : 26 Jun 2024 04:02 IST

ఫిట్స్‌తో పాఠశాల విద్యార్థిని మృతి
మూడేళ్ల కిందట కొవిడ్‌తో తండ్రి

నందిని (పాత చిత్రం)

పోడూరు, న్యూస్‌టుడే:  ఓ విద్యార్థిని ఫిట్స్‌తో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరి మృతి చెందిన ఘటన పోడూరు కల్నల్‌ డీఎస్‌రాజు జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పాఠశాల హెచ్‌ఎం ఐ.జనర్దన్‌రాజు, విద్యార్థిని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న చెల్లబోయిన అనూషగోపికానందిని (14) సోమవారం యథావిధిగా పాఠశాలకు వచ్చింది. మధ్యాహ్న విరామంలో భోజనం చేసి తరగతి గదికి వెళ్తుండా ఫిట్స్‌ రావడంతో నందిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తోటి విద్యార్థినులు, ఉపాధ్యాయులు సపర్యలు చేస్తూ విద్యార్థిని తాతయ్య కండిబోయిన భాస్కరరావుకు సమాచారమిచ్చారు. తాతయ్య సాయంలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రీనివాసరావు, లక్ష్మీలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కుసుమ పావని తనూజ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండో కుమార్తె నందిని మూగ, వినికిడి శక్తిలేని బాలిక. మూడేళ్ల కిందట తండ్రి శ్రీనివాసరావు కొవిడ్‌తో మృతి చెందారు. భర్త మరణంతో లక్ష్మి మెట్టినిల్లు వేడంగి నుంచి పుట్టినిల్లు పోడూరు వచ్చింది. పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగించి జీవనోపాధి కోసం గల్ఫ్‌ వెళ్లింది. చలాకీగా ఉండే నందిని కళ్ల ముందే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని