logo

దడ పుట్టిస్తున్న టమాటా

ఏ ఇంట్లోనైనా కూరలోకి టమాటా లేనిదే కుదరదు. సీజన్‌ ముగియడంతో దీని ధర దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో నెల రోజుల్లోనే టమాట ధర రెట్టింపైంది.

Updated : 26 Jun 2024 04:43 IST

పెంటపాడు, న్యూస్‌టుడే : ఏ ఇంట్లోనైనా కూరలోకి టమాటా లేనిదే కుదరదు. సీజన్‌ ముగియడంతో దీని ధర దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో నెల రోజుల్లోనే టమాట ధర రెట్టింపైంది. మూడు వారాలుగా ధర పెరుగుతూ వస్తోంది. మంగళవారం  తాడేపల్లిగూడెం బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయించారు. జిల్లాలోని పలు ప్రాంతాల రైతు బజార్లలో రూ.68 వరకు విక్రయిస్తున్నారు.

జిల్లాలోని అతి పెద్ద కూరగాయల మార్కెట్‌గా పేరు గాంచిన తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. మదనపల్లె పరిసర ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి అవుతుంది. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో తక్కువ మొత్తంలో దిగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే వరకు మరో మూడు వారాల వరకు ఇదే ధర కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

‘రూ.500 తీసుకుని కూరగాయల మార్కెట్‌కి  వెళ్తే కనీసం మూడు, నాలుగు రకాల కూరగాయలు కొనలేకపోతున్నాం. దీనికి తోడు టమాటా ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రెండు రకాల కూరగాయలు కొని సరిపెట్టుకుంటున్నాం’ అని తాడేపల్లిగూడేనికి చెందిన గృహిణి లక్ష్మి వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని