logo

బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులు

మండలంలో ప్రభుత్వ పాఠశాలల  ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఎంఈవోలు మస్తాన్ వ‌లి, ప్రేమ‌సాగర్ ప్రారంభించారు.

Published : 01 Jun 2024 13:41 IST

కలసపాడు: మండలంలో ప్రభుత్వ పాఠశాలల  ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం చేపట్టారు. దీన్ని ఎంఈవోలు మస్తాన్ వ‌లి, ప్రేమ‌సాగర్ ప్రారంభించారు.  మండలంలోని గంగాయపల్లె, రెడ్డిపల్లె, ఎగువ‌రామాపురం, తంబళ్లపల్లె, సింగరాయపల్లి గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను  అభ్యర్థించారు. కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్య, మౌలిక‌ వసతులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, వీరారెడ్డి, సత్యనారాయణ, క‌మాల్, పాండు, శివారెడ్డి, నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని