logo

Kadapa: గొంతు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

పశువుల్లో వచ్చే గొంతు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.

Published : 11 Jun 2024 15:37 IST

కలసపాడు: పశువుల్లో వచ్చే గొంతు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం మండలంలోని రాజుపాలెం, బ్రాహ్మణ పల్లెలో 300 పశువులకు ఉచితంగా గొంతు వాపు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి ముఖ్యంగా తక్కువ వయస్సు ఉన్న దూడలు, పడ్డల్లో 105 డిగ్రీల జ్వరంతో శ్వాస పీల్చుకోవడం కష్టమై గొంతు కింద, మెడ దగ్గర వాపు వచ్చి ఒక్కరోజులోనే పశువు మరణిస్తుంద‌న్నారు. అందువల్ల సకాలంలో టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణారెడ్డి, ఆర్.బి.కె ఇన్‌ఛార్జి సంధ్యారాణి, ఆర్బీకే ఏహెచ్ఏలు, గోపాలమిత్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని