logo

Kadapa: రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరనిలోటు

'ఈనాడు' గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి పత్రికా రంగం, తెలుగు వారికి తీరని లోటు అని ఎంఈవోలు మస్తాన్ వ‌లి, ప్రేమసాగర్ తెలిపారు.

Published : 10 Jun 2024 12:13 IST

కలసపాడు: 'ఈనాడు' గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతి పత్రికా రంగం, తెలుగు వారికి తీరని లోటు అని ఎంఈవోలు మస్తాన్ వ‌లి, ప్రేమసాగర్ తెలిపారు. సోమవారం కలసపాడులోని మండల విద్యా వనరుల కేంద్రంలో రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలుపుతూ,   ఆయ‌న‌ చిత్రపటానికి నివాళులర్పించారు.  సమాజానికి మేలు చేసిన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు సి.వెంకటరెడ్డి, బి.ఎన్.వి. ప్రసాద్, జిల్లా కన్వీనర్ కె.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు