logo

Kadapa: పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం

పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండవచ్చని పోరుమామిళ్ల మలేరియా సబ్ యూనిట్ అధికారి టి.నరసింహారెడ్డి తెలిపారు.

Updated : 10 Jun 2024 16:34 IST

కలసపాడు: పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండవచ్చని పోరుమామిళ్ల మలేరియా సబ్ యూనిట్ అధికారి టి.నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం కలసపాడు, తంబళ్లపల్లెలో మలేరియా మాసోత్సవాల‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత దోమల లార్వా నియంత్రణ, మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడువాపు, పచ్చ జ్వరం తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్లలో, డ్రైనేజీల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దీనివల్ల దోమలను నివారించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శైలజ సీహెచ్‌వో దుర్గ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని