logo

ఆర్టీపీపీకి వెలుగులొచ్చాయ్‌!

రాయలసీమ ప్రాంత వెలుగుల దివ్వె ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) ముంగిట ప్రాంతాలు అంధకారం నుంచి విముక్తి పొందాయి.

Published : 31 Mar 2023 01:47 IST

రాయలసీమ ప్రాంత వెలుగుల దివ్వె ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం (ఆర్టీపీపీ) ముంగిట ప్రాంతాలు అంధకారం నుంచి విముక్తి పొందాయి. ఇక్కడ నెలకొన్న చీకట్లతో ఆర్టీపీపీ ఉద్యోగులు, ఆ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు పడుతున్న ఇబ్బందులపై ‘ఈనాడు’లో ఈ నెల 21వ తేదీన ‘విద్యుత్తు ఉత్పత్తి... దీపాలు ఉత్తుత్తి’ అనే శీర్షికన ప్రచురితమైన చిత్రకథనంపై అధికారులు స్పందించారు. దాదాపు ఏడాదిగా చీకటి రాజ్యమేలిన ఈ ప్రాంతాలు గురువారం నుంచి క్రమంగా వెలుగులద్దుకున్నాయి. కార్యరంగంలోకి దిగిన సిబ్బంది విద్యుత్తు స్తంభాలకు మరమ్మతులు చేసి దీపాలు అమర్చారు.

న్యూస్‌టుడే, ఎర్రగుంట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని