logo

పోలీసుల అదుపులో అంతర్‌ జిల్లా దొంగలు

దొంగతనానికి గురైన ట్రాక్టర్‌తోపాటు ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ సదాశివయ్య తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 27 Sep 2023 04:06 IST

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: దొంగతనానికి గురైన ట్రాక్టర్‌తోపాటు ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ సదాశివయ్య తెలిపారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మైలవరం మండలం వేపరాల గ్రామానికి చెందిన మంచాల మోషె గని పని చేసుకుంటూ జమ్మలమడుగులో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ గని పనికి ట్రాక్టర్‌ను తీసుకెళ్లి రాత్రికి ఓ పెట్రోలు బంకు ఆవరణలో ఉంచేవారన్నారు. ఈ నెల 9న ఉదయం 4 గంటలకు వెళ్లి చూడగా ట్రాక్టర్‌ దొంగతనానికి గురైనట్లు తెలుసుకుని స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. మంగళవారం ప్రొద్దుటూరు బైపాస్‌ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. నంద్యాల జిల్లా పేరు సోముల గ్రామానికి చెందిన తండ్రీ కుమారులు హాజివలి, చాంద్‌బాషా దొంగలించిన ట్రాక్టర్‌ను తాడిపత్రి వైపు నుంచి ప్రొద్దుటూరుకు తీసుకెళ్తుండగా అరెస్టు చేశామన్నారు. ఇద్దరు దొంగలతోపాటు సుమారు రూ.5 లక్షల విలువైన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దర్యాప్తులో కృషి చేసిన ఎస్‌ఐ సుబ్బారావు, హెడ్‌ కానిస్టేబుల్‌ దేవదాసు, కానిస్టేబుల్‌ రియాజ్‌ అహ్మద్‌ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అభినందించారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని