logo

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని బుధవారం తెదేపా నాయకులు, అధికారులు, ఉద్యోగులు విజయవాడలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 13 Jun 2024 02:23 IST

రాంప్రసాద్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న కస్తూరి విశ్వనాథనాయుడు, విశ్వేశ్వరనాయుడు, నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని బుధవారం తెదేపా నాయకులు, అధికారులు, ఉద్యోగులు విజయవాడలో కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చిన్నబాబు, తెదేపా నాయకులు మల్లికార్జుననాయుడు, దొరస్వామినాయుడు, బి.శ్రీనివాసరాజు, భాజపా సీనియర్‌ నాయకుడు శ్రీనివాసకుమార్‌రాజు, అసెంబ్లీ కన్వీనర్‌ నిర్మల్‌కుమార్, మహేశ్వర్‌రాజు, పీఆర్‌టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకుడు ఎం.నరసింహారెడ్డి రాంప్రసాద్‌రెడ్డిని కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్‌ మాజీ కోఆప్షన్‌ సభ్యుడు సలావుద్దీన్‌ ఆధ్వర్యంలో మైనార్టీలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

రైల్వేకోడూరు : మంత్రి పదవి పొందిన మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు, పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వరనాయుడు తదితరులు బుధవారం విజయవాడలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయనను కోరారు. నాయకులు నాయుడోరి రమణ, పులేల రమేష్, కాకర్ల రెడ్డెయ్య, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని