logo

వైకాపా అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు

గత అయిదేళ్ల పాలనలో వైకాపా అరాచకాలను ఎదుర్కొన్న ప్రజలకు అండగా ఉంటామని తంబళ్లపల్లె తెదేపా నేత జయచంద్రారెడ్డి, ట©ఎస్‌ఎన్‌వీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామినాయుడు అన్నారు.

Published : 13 Jun 2024 02:23 IST

మాట్లాడుతున్న తెదేపా నేత జయచంద్ర రెడ్డి, పక్కన నాయకులు

ములకలచెరువు గ్రామీణ, న్యూస్‌టుడే: గత అయిదేళ్ల పాలనలో వైకాపా అరాచకాలను ఎదుర్కొన్న ప్రజలకు అండగా ఉంటామని తంబళ్లపల్లె తెదేపా నేత జయచంద్రారెడ్డి, ట©ఎస్‌ఎన్‌వీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామినాయుడు అన్నారు. సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ములకలచెరువులో నిర్వహించిన సంబరాల్లో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా పాలనలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా నాయకులు భూకబ్జాలు చేశారన్నారు. ప్రజలు వీటిని గమనించి సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిట© మాజీ ఛైర్మన్‌ మయిన్‌బాషా, మండల కన్వీనర్‌ పాలగిరి సిద్ద, నాయకులు తోట గిరిధర్, బాబునాయుడు, కట్టా సురేంద్రనాయుడు, శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని