logo

వెంకన్నతో ఆటలే... జగన్‌ ఓటమికి నాంది

వైకుంఠ వాసుడితో ఆడిన ఆటలే జగన్‌ కొంపముంచాయని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Published : 13 Jun 2024 02:34 IST

శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, సుభద్రమ్మ దంపతులు 

ఖాజీపేట, న్యూస్‌టుడే: వైకుంఠ వాసుడితో ఆడిన ఆటలే జగన్‌ కొంపముంచాయని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం డీఎల్‌ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. జగన్‌ రాష్ట్రాన్ని అథోగతిపాలు చేశారని విమర్శించారు. శ్రీవారి విషయంలో జగన్‌ పెద్ద తప్పు చేశాడన్నారు. చెవిరెడ్డి చెప్పిన మాటలు నమ్మి ఆయన సహాయంతో ఇంటి వద్దే శ్రీవారి ఆలయాన్ని రీక్రియేట్ చేయడాన్ని డీఎల్‌ హేయమైన చర్యగా అభివర్ణించారు. తిరుమలకు దంపతులు జంటగా రావాల్సిందిపోయి అలా చేయడం పాపమన్నారు. జగన్‌ చేసిన పాపానికి తగ్గట్టుగానే అతనికి దేవుడు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకెళుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

రాజోలి జలాశయాన్ని నిర్మించాలి

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: కడప, కర్నూలు జిల్లా సరిహద్దులోని కుందూనదిపై రాజోలి రిజర్వాయరును తక్షణమే నిర్మించాలని రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రతాప్‌రెడ్డి తెదేపా ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని