logo

గుర్తింపు లేని కళాశాలలపై చర్యలకు డిమాండు

రాయలసీమ వ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

Published : 13 Jun 2024 02:53 IST

కడప విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ వ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) కార్యాలయం ఎదుట పీఎస్‌వైఎఫ్, టీఆర్‌ఎస్‌ఎఫ్, ఆర్‌ఎస్‌వో, ఆర్‌వీఎఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ పలు కళాశాలలు ఎటువంటి అనుమతులు, సదుపాయాలు లేకుండా వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అనంతరం ఆర్‌జేడీ కార్యాలయ ఏవో రామ్‌నివాస్‌సింగ్‌ కి వినతిపత్రం అందజేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని