logo

వైకాపా నేతల భూఆక్రమణలు బయటపెడతాం

జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గంలో వైకాపా నేతల భూఆక్రమణలను బయటపెడతామని యండపల్లి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త సిద్ధార్థగౌడ్‌ పేర్కొన్నారు.

Published : 14 Jun 2024 04:18 IST

సామాజిక  మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న వీడియో

రాయచోటి, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గంలో వైకాపా నేతల భూఆక్రమణలను బయటపెడతామని యండపల్లి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త సిద్ధార్థగౌడ్‌ పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని గున్నికుంట్ల రోడ్డులోని ఎస్పీ బంగ్లా పక్కనున్న 70 సెంట్ల ప్రభుత్వ భూమిని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అనుచరులు పల్లా రమేష్, పోలు సుబ్బారెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. ఈ ఆక్రమిత భూమిలోకి వెళ్లి అక్రమంగా కట్టడాలకు ప్రభుత్వ భవనాల నుంచి తొలగించిన రాళ్లను తరలించి పునాదులు నిర్మించుకున్నారన్నారు. ఆక్రమిత స్థలంలో వీడియో ద్వారా అక్కడ జరిగిన భూఆక్రమణలపై వివరించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. వైకాపా నేతల భూఆక్రమణలను రోజుకొకటి బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అందాల్సిన ప్రభుత్వ భూములను ఆక్రమించి పేదల పొట్ట కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని