logo

వైఎస్సార్‌ జిల్లా పేరును వైఎస్సార్‌ కడప జిల్లాగా మార్చాలి

వైఎస్సార్‌ జిల్లా పేరును వైఎస్సార్‌ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి కోరారు. వేంపల్లెలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 14 Jun 2024 04:22 IST

వేంపల్లె, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ జిల్లా పేరును వైఎస్సార్‌ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఛైర్మన్‌ తులసిరెడ్డి కోరారు. వేంపల్లెలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. క్రీ.శ. 1808లో కడప జిల్లా ఏర్పాటైందన్నారు. వైఎస్సార్‌ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం ఈ జిల్లా పేరును కడప జిల్లా బదులు వైఎస్సార్‌ జిల్లాగా మార్చారన్నారు. అయితే జిల్లా ప్రజలు వైఎస్సార్‌ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుందని 2010లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. అప్పట్లో ఆ ప్రయత్నం ఫలించలేదని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున ఆలోచించి పేరు మార్చాలని ఆయన డిమాండు చేశారు.

ప్రొద్దుటూరు: కలియుగ దైవం వెంకన్న స్వామి దేవస్థానం ప్రవేశం తొలి గడపగా ప్రసిద్ధి చెందిన కడప జిల్లాను గత ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ జిల్లాగా పేరు మార్చిందని జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ కడపగా మార్చాలని ఏపీ రాష్ట్ర విభజన హామీల ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు పాతకోట శ్రీనాథ్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఎంతో విశిష్టత ఉన్న జిల్లాకు కడప అను పేరు లేక పోవడంతో ప్రజలందరు బాధ పడుతున్నారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని