logo

కార్డుదారులకు తీపి కబురు

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ఐదు హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకాలు చేశారు.

Published : 18 Jun 2024 03:02 IST

వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీకి ఏర్పాట్లు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే ఐదు హామీలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతకాలు చేశారు. తాజాగా పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. వైకాపా ప్రభుత్వంలో గడిచిన రెండేళ్లుగా రేషన్‌కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. అక్కడక్కడా అరకొరగా ఇస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు ధర రూ.150 పైన పలుకుతోంది.  ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి రేషన్‌కార్డులకు కందిపప్పు పంపిణీ చేయడానికి కొత్త ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పేద కుటుంబాలకు ఎంతో మేలు కలగనుంది. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న చౌకదుకాణాల నుంచి పేదలకు బియ్యం, కందిబేడలు, చక్కెరతో పాటు పలు నిత్యావసర సరకులు కూడా లభించేవి. వైకాపా ప్రభుత్వంలో కేవలం బియ్యం, చక్కెర మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో వచ్చే నెల నుంచి కందిపప్పుతోపాటు, రానున్న రోజుల్లో మరిన్ని సరకులు ఇస్తారని కార్డుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని