logo

చేపల చెరువు విషయంలో ఘర్షణ

జమ్మలమడుగు మండలంలో గత కొన్నేళ్లుగా చేపల చెరువు నిర్వహిస్తున్న వైకాపా మాజీ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ సుబ్బరాయుడు, ఎన్డీఏ కూటమి నేతల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది.

Published : 18 Jun 2024 03:04 IST

నలుగురికి తీవ్ర గాయాలు 
14 మందిపై కేసు నమోదు 

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: జమ్మలమడుగు మండలంలో గత కొన్నేళ్లుగా చేపల చెరువు నిర్వహిస్తున్న వైకాపా మాజీ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ సుబ్బరాయుడు, ఎన్డీఏ కూటమి నేతల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. పొన్నతోటలోని నర్సోజికొట్టాలపల్లె మారెమ్మ దేవాలయం సమీపంలో మైలవరానికి చెందిన సుబ్బరాయుడు కొన్నేళ్లుగా చేపల చెరువు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా చెరువు ఎలా నిర్వహిస్తారని స్థానిక ఎన్డీఏ నాయకులు చంద్రమెహన్, తిరుపాల్‌రెడ్డి, పుల్లారెడ్డి సుబ్బరాయుడును ఇటీవల ప్రశ్నించారు. దీంతో వీరి మధ్య రాజీకి హోంగార్డ్‌ వర్మ మారెమ్మ గుడి వద్దకు పిలిపించగా అక్కడ ఘర్షణ జరిగింది.

ఆపై చేపల చెరువు వద్ద ఇరువురు రాళ్లు, కర్రలతో కొట్టుకోగా ఎన్డీనే నాయకులు తిరుపాల్‌రెడ్డి, పుల్లారెడ్డి, చంద్రమోహన్‌లతోపాటు సుబ్బరాయుడు గాయపడ్డారు. వీరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపాల్‌రెడ్డి, పల్లారెడ్డిని ప్రొద్దుటూరుకు తరలించారు. గొడవలో తిరుపాల్‌రెడ్డికి చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. చేపల చెరువు నిర్వహణపై ప్రశ్నించినందుకు తమపై గొడవకు దిగారని ఎన్డీఏ నాయకులు సుబ్బరాయుడుతో పాటు మరో ఆరుగురిపై ఫిర్యాదు చేయగా, తన వద్దకు వచ్చి రూ.20 లక్షలు డిమాండ్‌ చేశారని సుబ్బరాయుడు చంద్రమోహన్‌తో పాటు మరో ఆరుగురిపై ఫిర్యాదు చేశారు. ఇలా ఇరువురి ఫిర్యాదులపై 14 మందిపై కేసు నమోదు చేశామని పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని