logo

నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కడపకు రాక

కేంద్ర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మంగళవారం కడప నగరానికి రానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది.

Published : 18 Jun 2024 03:09 IST

 

 

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కేంద్ర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మంగళవారం కడప నగరానికి రానున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. కలెక్టరేట్‌లో సాయంత్రం జరిగే పీఎం కిసాన్‌ యోజన 17వ విడత నిధుల విడుదల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రిగా తొలిసారి రామ్మోహన్‌నాయుడు కడపకు రానుండడంతో తెదేపా నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా జిల్లా రైతులు వీక్షించేందుకు కృషి విజ్ఞాన శిక్షణ కేంద్రం శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని