logo

మాట తప్పని నాయకుడు చంద్రబాబు

అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతూ సంతకం చేసి సీఎం చంద్రబాబునాయుడు మాట తప్పని నేతగా నిలిచారని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి పేర్కొన్నారు.

Published : 18 Jun 2024 03:10 IST

పాలాభిషేకం చేసిన దివ్యాంగులు

రాయచోటి, న్యూస్‌టుడే: అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతూ సంతకం చేసి సీఎం చంద్రబాబునాయుడు మాట తప్పని నేతగా నిలిచారని దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి పేర్కొన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన దివ్యాంగులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అయిదేళ్లుగా రూ.6 వేలు పింఛను ఇవ్వాలని వైకాపా ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గణపతి, అన్వర్‌బాషా, రామచంద్రారెడ్డి, మణికంఠరెడ్డి, రమణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని