logo

కిలో టమాట రూ.80

మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం కిలో టమాట ధర అత్యధికంగా రూ.80 పలికింది. బక్రీద్‌ను పురస్కరించుకుని మార్కెట్‌కు తక్కువ కాయలు రైతులు తీసుకొచ్చారు.

Updated : 18 Jun 2024 04:58 IST

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం కిలో టమాట ధర అత్యధికంగా రూ.80 పలికింది. బక్రీద్‌ను పురస్కరించుకుని మార్కెట్‌కు తక్కువ కాయలు రైతులు తీసుకొచ్చారు. గత వారం రోజులుగా అత్యల్పంగా కిలో రూ.41 నుంచి అత్యధికంగా రూ.64 వరకు ఉంది. ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో సరకు తగ్గడంతోపాటు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోని దిగుబడి తగ్గింది. ఫలితంగా నాణ్యమైన టమాట మార్కెట్‌కు రావడం లేదు. ఈ నేపథ్యంలో మదనపల్లె మార్కెట్‌కు డిమాండు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌కు రోజు 600 నుంచి 750 టన్నుల మేర రైతులు సరకు తీసుకొస్తున్నారు. సోమవారం బక్రీద్‌ పండగ కావడంతో మార్కెట్‌కు ఎగుమతికి అవసరమైన సరకు కంటే తక్కువగా వచ్చింది. మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి కేవలం 396 టన్నులు మాత్రమే తీసుకొచ్చారు. దీంతో ఏ గ్రేడ్‌ కిలో రూ.69 నుంచి రూ.80 వరకు, బీ గ్రేడ్‌ రూ.50 నుంచి రూ.68 వరకు పలికింది. మార్కెట్‌లో సగటున 25 కిలోల బుట్ట ధర రూ.1,600 నుంచి రూ.1,900 వరకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి బయట మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని