logo

అంటకాగితే అంతే!

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిన వివాదాస్పద అధికారులపై వేటు వేయడం ప్రారంభించింది. వైకాపాతో అంటకాగుతూ తెదేపాతో పాటు దాని మిత్రపక్షాలను ఇబ్బందులు పెట్టిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటోంది.

Published : 18 Jun 2024 03:14 IST

పోలీసు అధికారులపై కొత్త ప్రభుత్వం చర్యలు 
ఇద్దరు సీఐలు, ఒక ఎస్‌.ఐ. వీఆర్‌కు బదిలీ

ఈనాడు, కడప: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించిన వివాదాస్పద అధికారులపై వేటు వేయడం ప్రారంభించింది. వైకాపాతో అంటకాగుతూ తెదేపాతో పాటు దాని మిత్రపక్షాలను ఇబ్బందులు పెట్టిన అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. కొత్త ప్రభుత్వం మొదటగా జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేసింది. చాపాడు ఎస్‌.ఐ. కొండారెడ్డి వైకాపాతో అంటకాగుతూ బహిరంగంగా ఆ పార్టీకి వత్తాసు పలుకుతూ తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌ రోజు తెదేపా ఏజెంట్లపై దాడులు, కుందూ నది నుంచి ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసే వైకాపా నేతలపై చర్యలు తీసుకోకపోవడం తదితర అంశాలను ప్రస్తావించారు. ఎన్నికల్లో కూటమి విజయం అనంతరం సైతం మట్టి, ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న వైకాపా నేతల యంత్రాలను సీˆజ్‌ చేయకుండా నామమాత్రంగా కేసులు నమోదు చేశారంటూ అధికార పార్టీ అభియోగాలు మోపింది. దీంతో ఎస్‌.ఐ.ను రెండు రోజుల కిందట వీఆర్‌కు పంపడంతోపాటు జిల్లాలో లేకుండా తిరుపతి బదిలీ చేశారు. మైదుకూరు గ్రామీణ సీˆఐ ఎం.శ్రీనాథ్‌రెడ్డి, అర్బన్‌ సీఐ ఏపీ మస్తాన్‌పై బదిలీ వేటు పడింది. వీరిద్దరూ మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండడంతోపాటు వైకాపాకు అంటకాగారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ రోజు సైతం వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిన కేంద్రాల్లో బందోబస్తు తక్కువగా ఉంచి తెదేపా సానుభూతిపరుల ప్రాంతాల్లో వేధింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పుట్టా ఉన్నతాధికారుల వద్ద ఆధారాలతో సహా ప్రస్తావించారు. దీంతో సీˆఐలు ఇద్దరినీ వీఆర్‌కు బదిలీ చేశారు. మైదుకూరు రూరల్‌ సీఐగా కడప వీఆర్‌లో ఉన్న జె.శివశంకర్, పట్టణ సీఐగా కర్నూలు రేంజ్‌లో వీఆర్‌లో ఉన్న డి.రామాంజనేయుడిని నియమించారు. జిల్లాలో తొలిగా జరిగిన మూడు బదిలీలపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని