logo

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

త్యాగానికి ప్రతీక బక్రీద్‌ అని ముస్లిం మత గురువు ఇనాయతుల్లా మౌలి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, కమలాపురంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Published : 18 Jun 2024 03:18 IST

న్యూస్‌టుడే, చిన్నచౌకు (కడప): త్యాగానికి ప్రతీక బక్రీద్‌ అని ముస్లిం మత గురువు ఇనాయతుల్లా మౌలి పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల, కమలాపురంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్‌ పండగ సందర్భంగా కడప నగరంలోని బిల్టప్‌ కూడలి సమీపంలోని ఈద్గా మైదానంలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. పెద్దదర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ముస్లిం మతపెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ప్రార్థనలకు వచ్చిన వారికి అధికారులు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మత గురువు మాట్లాడుతూ బక్రీద్‌ సందర్భంగా ప్రతి ఒక్కరూ దానధర్మాలు చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని