logo

దొరకని దస్త్రం... కమిషనరేట్‌కు సమాచారం

ఆర్బీకేల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి వ్యవసాయశాఖలో మాయమైన కీలకదస్త్రం అంశం రాజధానికి చేరింది. జిల్లా కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటన విషయం...

Published : 21 Jun 2024 04:19 IST

కడప వ్యవసాయం, న్యూస్‌టుడే: ఆర్బీకేల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి వ్యవసాయశాఖలో మాయమైన కీలకదస్త్రం అంశం రాజధానికి చేరింది. జిల్లా కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటన విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అంత విలువైన ఫైల్‌ కనిపించకపోవడంపై కమిషనరేట్‌ అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కార్యాలయంలో సంబంధిత సిబ్బందిని దస్త్రం కనిపించలేదని రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారి ఆదేశించినట్లు సమాచారం. ఆ తరువాత బాధ్యులైనా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని