logo

అక్షర యోధుడికి ఘన నివాళి

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ ఈనాడు కడప యూనిట్‌ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Published : 21 Jun 2024 04:25 IST

జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రామోజీరావు సంస్మరణ సభలు

రామోజీరావు చిత్రపటం ముందు నివాళులర్పిస్తున్న ఈనాడు గ్రూప్‌ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది... 

నాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ ఈనాడు కడప యూనిట్‌ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొన్ని నిమిషాలపాటు మౌనం పాటించారు. యూనిట్‌ మేనేజరు డి.వి.రమణ మాట్లాడుతూ ఛైర్మన్‌ రామోజీరావు నవతరానికి స్ఫూర్తి అని, ఆయన చేసిన  సేవలను గుర్తుచేసుకున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పించి మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. పలువురు ఉద్యోగులు, సిబ్బంది రామోజీరావుతో తమ అనుభవాలు గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయ సాధనకు పాటుపడతామని ప్రతిన బూనారు.

ఈనాడు, కడప

రామోజీరావు సంస్మరణ సభలో మౌనం పాటిస్తున్న సిబ్బంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని