logo

ఓపికతో ఉంటేనే వైద్యసేవలు!

అనారోగ్యంతో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తే ఓపీ చీటీల కోసం  గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 21 Jun 2024 04:27 IST

ఓపీ చీటీ త్వరగా ఇవ్వాలని వైద్యసిబ్బందిని వేడుకుంటున్న రోగులు, వారి బంధువులు

నారోగ్యంతో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తే ఓపీ చీటీల కోసం  గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తరచూ ఎదురవుతున్న సర్వరు ఇబ్బందులతో ఓపీ చీటీల జారీలో అవస్థలు తప్పడం లేదు. వారంలో ఒకట్రెండు రోజులు తప్ప సర్వరు ఎప్పుడూ పనిచేయదని పలువురు మండిపడుతున్నారు. గతంలోనూ ఇదే పరిస్థితి నెలకొనగా సిబ్బంది కాగితంపై రాసిచ్చేవారని, ప్రస్తుతం కూడా అదేవిధంగా ఇవ్వాలని అడిగితే తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఇబ్బందులపై ఆసుపత్రి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి మాట్లాడుతూ సర్వరు పనిచేయకపోతే చీటీలపై రాసివ్వాలని సిబ్బందికి చెప్పామన్నారు. వారు ఇవ్వకుండా రోగులను ఎందుకు నిరీక్షించేలా చేశారో తెలుసుకుని  చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  

న్యూస్‌టుడే, సర్వజన ఆసుపత్రి 

గురువారం ఉదయం 11 గంటలకు వరుసలో నిరీక్షిస్తున్న రోగులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని