logo

కోలాహలంగా ఎడ్ల బండలాగుడు పోటీలు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గన్నేపల్లి పంచాయతీలో అడవి పేరంటాలమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయం వద్ద ఎడ్ల బండ లాగుడు పోటీలు కోలాహలంగా జరిగాయి.

Published : 21 Jun 2024 04:33 IST

బండలాగుతున్న ఎడ్లు 

ఉదయగిరి, న్యూస్‌టుడే : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గన్నేపల్లి పంచాయతీలో అడవి పేరంటాలమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయం వద్ద ఎడ్ల బండ లాగుడు పోటీలు కోలాహలంగా జరిగాయి. పోటీల్లో మూడు ఎడ్ల జతలు పాల్గొనగా వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు మండలంలోని పోలిరెడ్డిపల్లికి చెందిన మూల సూరారెడ్డి ఎడ్లు ప్రథమ స్థానం, గోపవరం మండలం వర్లవారిపల్లికి చెందిన బండి భార్గవ్‌ ఎడ్లు ద్వితీయ స్థానం, చెన్నూరు మండలం ఓబుళంపల్లికి చెందిన పానపురెడ్డి సతీష్‌రెడ్డి ఎడ్లు తృతీయ స్థానంలో నిలిచాయి. వీటి యజమానులకు బహుమతులు అందజేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని