logo

ఆక్రమణదారుకు ఝలక్‌..

స్థానిక మోడంపల్లె బైపాసు రహదారి నుంచి గ్రీన్‌ల్యాండు కాలనీ మార్గంలో కబ్జాకుగురైన పాత కచ్ఛా కాలువను రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించడంతో ఆక్రమణదారు చెర నుంచి విముక్తి కల్పించారు.

Published : 21 Jun 2024 04:37 IST

పూడ్చేసిన కాలువలో చేరిన నీరు

మట్టి తొలగింపుతో వర్షపు నీటి నిల్వ

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ : స్థానిక మోడంపల్లె బైపాసు రహదారి నుంచి గ్రీన్‌ల్యాండు కాలనీ మార్గంలో కబ్జాకుగురైన పాత కచ్ఛా కాలువను రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించడంతో ఆక్రమణదారు చెర నుంచి విముక్తి కల్పించారు. పూడ్చేసిన గుంతల్లో నుంచి మట్టి తొలగింపు వలన మళ్లీ రూపురేఖలను తీసుకువచ్చారు. ఎట్టకేలకు ఆక్రమణదారుకు ఝలక్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలు దృష్ట్యా పాత కాలువలోకి చేరిన నీటి మడుగు.. సాగునీటి కాలువను తలపిస్తోంది. కబ్జాదారు బరితెగింపుతో ఏకంగా జేసీబీతో ఈ కాలువ ఆనవాళ్లు లేకుండా పూడ్చేశారు. దీనిపై ‘మురుగు కాలువ ఆక్రమణ’పై గత మే 18న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీంతో తహసీల్దారు విద్యాసాగర్‌ ఆదేశాలతో 417 సర్వే పరిధిలో 250 మీటర్లు వరకు పూడ్చేసిన కాలువలోని మట్టిని జేసీబీతో తొలగించారు. సర్వేయరు రెవెన్యూ దస్త్రంలోని హద్దులను ఖరారు చేసి పిగ్‌ మార్కులను ఏర్పాటు చేశారు. సాయిరాజేశ్వరి కాలనీ నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేక లోతట్టులో పాచిపట్టిన మడుగులు, పిచ్చి మొక్కలతో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ప్రత్యామ్నాయంగా పాత కాలువకు మురుగు వెళ్లేందుకు అనుసంధానంగా కాంక్రీటు పనులు చేపడితే సమస్యకు శాశ్విత పరిష్కారం ఉంటుంది. దీనిపై కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి నరసింహులు వివరణ కోరగా పాలకవర్గం ఆమోదంతో కచ్ఛా మార్గాన్ని కాంక్రీటుతో కాలువ ఏర్పాటు పనులను  చేపడతామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని