logo

ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌లో అక్కడికక్కడే సమస్యల పరిష్కారం

చాలా రోజులు నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలను ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌ కార్యక్రమంలో అక్కడికక్కడే వాటికి పరిష్కారం చూపుతామని ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి అన్నారు.

Published : 21 Jun 2024 04:42 IST

సమస్య వింటున్న ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌ ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : చాలా రోజులు నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలను ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌ కార్యక్రమంలో అక్కడికక్కడే వాటికి పరిష్కారం చూపుతామని ఛైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి అన్నారు. గురువారం పట్టణంలోని సీటీఎం రోడ్డులోని విద్యుత్తు డివిజన్‌ కార్యాలయంలో దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ, విద్యుత్తు వినియోగదారుల పరిష్కార వేదిక ఆధ్వర్యంలో వినియోగదారులకు ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ మండలాలకు సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. వినియోగదారులకు సమస్యలు వస్తే అధికారులను నిలదీయడానికి ఫోరమ్‌లు, కోర్టులు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సేవలు ఆలస్యం కాకుండా మెసేజ్, అర్జీ, వాట్సాప్‌ రూపంలో వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పట్టణంలోని రామారావు కాలనీలో 33 కేవీ విద్యుత్తు తీగలు ఇళ్ల మీద వెళ్తున్నాయని వాటిని మార్చాలని కాలనీవాసులు ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌లో వినతిపత్రం ఇచ్చారు. మదనపల్లె మండలం బాలాజీనరగ్, సత్యసాయినగర్, గోకుల్‌వీధిలో నివాసముంటున్న 250 కుటుంబాలకు విద్యుత్తు బిల్లులు అధికంగా వస్తున్నాయని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆర్థిక సభ్యులు కె.రామ్మోహన్‌రావు, సాంకేతిక సభ్యులు ఎస్‌.ఎల్‌.అంజనీకుమార్, స్వతంత్ర సభ్యులు జి.ఈశ్వరమ్మ, మదనపల్లె డివిజన్‌ కార్యాలయం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు యుగంధర్, ఏడీఈ జీవన్‌కుమార్, సురేంద్రనాయక్, రుక్మాందబాబు, ఏఏఓ కిరణ్‌కుమార్, ఏఈలు నరసింహారెడ్డి, గోవిందరెడ్డి, రెడ్డికుమార్, రమేశ్, వసంతరెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని