logo

Kadapa: తాగునీటి ఎద్దడిపై దృష్టి సారించాలి

మండలంలో తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల అధ్యక్షురాలు నిర్మలాదేవి తెలిపారు.

Updated : 24 May 2024 17:25 IST

కలసపాడు: మండలంలో తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల అధ్యక్షురాలు నిర్మలాదేవి తెలిపారు. శుక్రవారం కల‌స‌పాడు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్ట్యా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పలు శాఖల పనితీరును సమీక్షించారు.  ఈ కార్యక్రమంలో తహసీల్దార్  కృష్ణకుమార్, ఎంఈవో మ‌స్తాన్ వ‌లి, ఏఈలు బాలిరెడ్డి, అల్లాబ‌కాష్, ఎంపీటీసీలు, సర్పంచులు,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు