logo

Kadapa: తెదేపా వీరాభిమాని విందు ఏర్పాటు

మండలంలోని మామిళ్ళపల్లెకు చెందిన తెదేపా వీరాభిమాని బాలిబోయిన బాలకృష్ణ తెదేపా అధినేత చంద్రబాబును జైల్లో వేసినప్పుడు మానసికంగా కుంగి పోయాడు.

Published : 12 Jun 2024 15:06 IST

క‌ల‌స‌పాడు: మండలంలోని మామిళ్ళపల్లెకు చెందిన తెదేపా వీరాభిమాని బాలిబోయిన బాలకృష్ణ తెదేపా అధినేత చంద్రబాబును జైల్లో వేసినప్పుడు మానసికంగా కుంగి పోయాడు. దీంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే గడ్డం తీస్తానని ప్రతినభూని అప్పటినుంచి గడ్డం పెంచాడు. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బాలకృష్ణ కార్యకర్తల సమక్షంలో తన గడ్డం తీశాడు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి కార్యకర్తలకు విందు భోజనం ఏర్పాటు చేశాడు. గతంలో తెదేపా యువ నేతలు నారా లోకేష్, రితీష్ రెడ్డి పాదయాత్రలో బాలకృష్ణ చురుగ్గా పాల్గొని తన అభిమానాన్ని చాటుకున్నాడు. తెదేపా నాయకులు కె.రామసుబ్బయ్య, జి.వెంకటేశ్వర్లు, చంద్రమోహన్ రెడ్డి, బాలసిద్ధయ్య, రమణయ్య తదితరులు వీరాభిమాని బాలకృష్ణను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని