logo

Kalasapadu: రెండు గ్రామాల్లో పోలీసుల కవాతు

మండలంలోని ఎగువ‌రామాపురం, తంబ‌ళ్ళప‌ల్లెల్లో పోలీసులు కవాతు చేశారు.

Published : 30 May 2024 15:56 IST

కలసపాడు: మండలంలోని ఎగువ‌రామాపురం, తంబ‌ళ్ళప‌ల్లెల్లో పోలీసులు కవాతు చేశారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు గురువారం క‌ల‌స‌పాడు, పోరుమామిళ్ళ ఎస్.ఐ.లు నాగమురళి, మ‌ల్లికార్జున‌రెడ్డి, పోలీస్ బలగాలు నాగబందీ, కవాతు, గ్రామసభ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ త‌రువాత‌ ఎలాంటి అవాంఛనీయ సంఘటన‌ల‌కు పాల్పడ‌కూడ‌ద‌న్నారు. గ్రామంలో గడ్డివాములు, గృహాలు,  పలుచోట్ల సోదాలు చేశారు. అనుమతి లేకుండా అక్రమ మద్యం, మందు గుండు సామగ్రి, ఫైర్ క్రాకర్స్ వల్ల లాంటివి ద‌గ్గర‌ ఉంచుకున్నా, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల జోలికి వెళ్లిన సమస్యలు సృష్టించినా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయ‌డంతో పాటు రౌడీషీట్ తెరుస్తామ‌ని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు