logo

Kadpa: జీవో 117ను రద్దు చేయాలి

ప్రభుత్వ విద్యారంగానికి తీవ్ర ప్రమాదకరంగా మారిన జీవో 117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి నూతన ప్రభుత్వాన్ని కోరారు.

Published : 20 Jun 2024 19:22 IST

కలసపాడు: ప్రభుత్వ విద్యారంగానికి తీవ్ర ప్రమాదకరంగా మారిన జీవో 117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి నూతన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండలంలోని ఎగువరామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 117ను రద్దుచేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. విలీనాన్ని రద్దుచేసి ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాత పద్ధతిలో పాఠశాలలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయడం వల్ల ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయవచ్చు అని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎం.శేఖర్ బాబు, జిల్లా ఆదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.వి. సత్యనారాయణ, జిల్లా కమిటీ కన్వీనర్ కె.వి. సత్యనారాయణ శ్రీనివాసులు వెంకటరెడ్డి, ప్రసాద్, రాజు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని