logo

వంట ఏజెన్సీ నిర్వాహకులకు బహుమతులు అందజేత

మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండలంలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఎంఈవోలు మస్తాన్ వ‌లి, ప్రేమ్ సాగర్ ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.

Published : 30 May 2024 14:12 IST

క‌ల‌స‌పాడు: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండలంలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఎంఈవోలు మస్తాన్ వ‌లి, ప్రేమ్ సాగర్ ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్లు సి.వెంకట రెడ్డి, ఎన్.శివారెడ్డి  మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలకు పౌష్టికాహారాన్ని  అందించాలని సూచించారు. ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం వంట నిర్వాహకులకు పోటీలు నిర్వహించారు. జడ్పీ బాలుర‌ ఉన్నత పాఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకురాలు బి.లక్ష్మీదేవి ప్రథమ, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వంట ఏజెన్సీ నిర్వాహకురాలు ఎల్.ఆదిలక్ష్మి ద్వితీయ, పుల్లారెడ్డిపల్లె వంట ఏజెన్సీ నిర్వాహకురాలు వై.విజయమ్మ తృతీయ బహుమతులు అందుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని