
Sand APMDC: 7 లక్షల టన్నుల ఇసుక ఏమైంది?
విలువ రూ.33.25 కోట్లు
గ్రౌండ్ లాస్ అంటున్న ఏపీఎండీసీ
ఆడిట్ జరిపి.. డబ్బు రాబట్టాలని ఉన్నతాధికారుల ఆదేశం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సమీపంలో గతంలో నిల్వచేసిన నాణ్యతలేని ఇసుక
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అయిదు నెలల క్రితం వరకూ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరగగా.. ఆ సమయంలో ఏడు లక్షల టన్నుల ఇసుక ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. రికార్డుల ప్రకారం ఉన్న ఇసుకకు, క్షేత్రస్థాయిలో ఉన్నదానికి వ్యత్యాసం ఉండటంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక బాధ్యతలు జేపీ సంస్థ ఈ ఏడాది మే 14 నుంచి తీసుకుంది. అప్పటి వరకు నిల్వ కేంద్రాలు, డిపోల్లో ఏపీఎండీసీ ఉంచిన ఇసుకను, జేపీ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. దీనిని విక్రయించగా వచ్చిన డబ్బును ఏపీఎండీసీకి చెల్లించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే ఏపీఎండీసీ రికార్డుల ప్రకారం.. డిపోలు, నిల్వ కేంద్రాల్లో 21 లక్షల టన్నులు జేపీ సంస్థకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే గనులశాఖ అధికారులు, జేపీ సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా కొలతలు వేయగా.. వాస్తవంగా ఉన్నది 14 లక్షల టన్నులేనని తేల్చారు.
రూ.33.25 కోట్ల విలువగల ఇసుకకు బాధ్యులు ఎవరు?
వ్యత్యాసమున్న ఇసుకతో తమకు సంబంధంలేదని జేపీ సంస్థ తెగేసి చెబుతోంది. ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.475 చొప్పున లెక్కిస్తే.. ఏడు లక్షల టన్నులకు రూ.33.25 కోట్లు అవుతుంది. ఆయా డిపోలు, నిల్వ కేంద్రాలకు తరలించినందుకు అయిన రవాణా ఖర్చులు కూడా పరిగణిస్తే అది మరింత ఎక్కువే ఉంటుంది. ఇదంతా ఏపీఎండీసీ కోల్పోవలసి వస్తుంది. అయితే ఇదంతా గ్రౌండ్లాస్ అని అధికారులు తొలుత వివరణ ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో గతంలో రీచ్‌ల వారీగా జరిగిన తవ్వకాలు.. డిపోలు, నిల్వ కేంద్రాలకు రవాణా.. విక్రయాలు.. అన్నింటిపై ఆడిట్ జరపాలని ఆదేశించారు. తవ్వకాలు, రవాణాలో తేడా ఉంటే.. వాటి గుత్తేదారులు నుంచి, డిపోల్లోనే తేడా జరిగితే బాధ్యులైన సిబ్బంది నుంచి డబ్బులు రాబట్టాలని పేర్కొన్నట్లు తెలిసింది.
నాణ్యత లేనిది వద్దు..
జేపీ సంస్థకు అప్పగించిన 14 లక్షల టన్నుల ఇసుకలో కూడా కొన్నిచోట్ల నాణ్యత లేనిది ఉన్నట్లు ఆ సంస్థ గుర్తించింది. గతంలో పట్టా భూముల్లో మట్టితో సహా ఇసుకను తవ్వి నిల్వకేంద్రాలు, డిపోలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటిది రాష్ట్రమంతా కలిపి దాదాపు 2-3 లక్షల టన్నుల వరకు ఉన్నట్లు తెలిసింది. దీనిని తాము విక్రయించబోమని, వీటికి డబ్బులు కూడా చెల్లించమని జేపీ సంస్థ పేర్కొంటోంది. దీంతో ఈ ఇసుక తవ్వి, డిపోలకు రవాణా చేసిన గుత్తేదారులకు చెల్లింపులు జరపొద్దని ఏపీఎండీసీకి, ఉన్నతాధికారులు ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Cm Kcr: హైదరాబాద్ వేదికగా మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్
-
Movies News
Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్‌చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
Sports News
IND vs ENG: ఆడేది నాలుగో మ్యాచ్.. అలవోకగా కేన్, విరాట్ వికెట్లు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rishabh Pant : సూపర్ రిషభ్.. నువ్వొక ఎంటర్టైన్ క్రికెటర్‌వి
-
Politics News
Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!