AP News:రోజుకు 41

రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. సగటున రోజుకు 41 చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు, ఇళ్ల లూటీల వంటి నేరాలకు తెగబడుతున్నారు. 2020తో పోలిస్తే 2021 జనవరి నుంచి నవంబరు వరకు ఈ

Updated : 03 Jan 2022 06:13 IST

రాష్ట్రంలో పెరుగుతున్న చోరీలు, దోపిడీలు, ఇళ్ల లూటీలు
2020తో పోలిస్తే నిరుడు 15.37 శాతం ఎక్కువ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. సగటున రోజుకు 41 చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు, ఇళ్ల లూటీల వంటి నేరాలకు తెగబడుతున్నారు. 2020తో పోలిస్తే 2021 జనవరి నుంచి నవంబరు వరకు ఈ తరహా నేరాలు 15.37 శాతం మేర పెరిగాయి. నిరుడు తొలి 11 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 1,27,127 కేసులు నమోదు కాగా.. అందులో 10.98 శాతం ఘటనలు చోరీలు, బందిపోటు దొంగతనాలు, దోపిడీలు, ఇల్లు కొల్లగొట్టడాలు, లాభం కోసం హత్యల వంటి సంఘటనలే. ఆర్థిక సంబంధమైన నేరాలుగా (ప్రాపర్టీ అఫెన్సెస్‌) పరిగణించే వీటిల్లో 73.67 శాతం చోరీలే ఉన్నాయి.

రోజుకు రూ.15.59 లక్షల సొత్తు దొంగల పాలు
* మొత్తం 18 పోలీసు యూనిట్లకుగాను రాజమహేంద్రవరం అర్బన్‌, విశాఖపట్నం సిటీ, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల పరిధిలో రూ.56.91 కోట్ల విలువైన సొమ్ము పోయింది. అంటే రోజుకు సగటున రూ.15.59 లక్షల సొత్తును దొంగలు దోచుకున్నారు.

* విశాఖ నగరంలో రోజుకు సగటున రూ.1,77,808 విలువ గల సొత్తును దొంగలు దోచుకున్నారు.

* విజయనగరం జిల్లాలో 2020లో జరిగిన దొంగతనాల్లో రూ.1.34 కోట్ల విలువైన సొత్తు పోగా, 2021లో రూ.2.07 కోట్ల సొత్తు పోయింది.


పోయిన సొత్తూ ఎక్కువే..

విజయనగరం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, విశాఖ నగరం, రాజమహేంద్రవరం అర్బన్‌ తదితర యూనిట్ల పరిధిలో 2020లో పోయిన సొత్తు కంటే 2021లో పోయిన సొత్తు ఎక్కువ. చిత్తూరులో 2021లో అత్యధికంగా రూ.10.06 కోట్లు, నెల్లూరులో రూ.9.94 కోట్లు, ప్రకాశంలో రూ.9.36 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.9.22 కోట్ల విలువైన సొత్తు పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని