
Azadi Ka Amrit Mahotsav: రాజద్రోహం.. పొరపాటున తొలగెన్!
రాజద్రోహాన్ని ఉంచాలా? తొలగించాలా అని స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ తర్జనభర్జన పడుతున్నాంగాని... ఆరంభంలోనే ఈ రాజద్రోహ నేరం చట్టంలోంచి అనూహ్యంగా తొలగిపోయింది. ఆశ్చర్యపోయిన ఆంగ్లేయులు మళ్లీ పట్టుబట్టి సవరణలు చేసి మరీ తీసుకొచ్చి మనపై రుద్దారు!
ఆంగ్లేయ విద్యావిధానాన్ని మనపై రుద్దిన లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలేనే భారత శిక్షాస్మృతిని కూడా రూపొందించాడు. వ్యాపారం పేరిట వచ్చి పాలన పగ్గాలు చేపట్టిన ఈస్టిండియా కంపెనీకి భారత్‌లోని భౌగోళిక వైవిధ్యం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా శాంతిభద్రతలు, నేరాలు, శిక్షల విషయంలో ఏకరూపత ఉండాలని భావించింది. ఇందుకోసం ఈస్టిండియా కంపెనీ 1833 బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ యాక్ట్ ఆధారంగా... భారత్‌లో తొలి న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీని బాధ్యతలను అవివాహితుడైన లార్డ్ మెకాలేకు అప్పగించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఆయన విరచితాలే! 1837లోనే మెకాలే ముసాయిదా సిద్ధం చేసినా... అవి 1860-61నాటికిగాని చట్టంగా మారలేదు. మెకాలే రూపొందించిన భారత శిక్షాస్మృతి 1837 ముసాయిదాలోని 113వ సెక్షన్... ప్రస్తుతం వివాదం నడుస్తున్న ఐపీసీ 124ఎ రాజద్రోహ నిబంధనకు ప్రతిరూపమే! 113వ సెక్షన్ కింద... రాజద్రోహ నేరానికి పాల్పడ్డట్టు తేలినవారికి జీవితఖైదు విధించాలని మెకాలే సిఫార్సు చేశాడు. అయితే తర్వాత వచ్చిన లా కమిషన్ ఈ శిక్షను సవరించాలని సూచించింది. ఇంగ్లాండ్‌లో అప్పటికి రాజద్రోహ నేరానికి గరిష్ఠంగా మూడేళ్లు శిక్ష విధించేవారు. భారత్‌లో ఐదేళ్లు విధించాలని రెండో న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల సంగతి ఎలా ఉన్నా... 1860లో ఐపీసీని అమల్లోకి తెచ్చే సమయానికి... రాజద్రోహ నేరం అందులోంచి మాయమైంది. నేరశిక్షాస్మృతిలో మెకాలే సూచించిన రాజద్రోహం ఎక్కడా లేదు. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈస్టిండియా కంపెనీ పోయి పాలన పగ్గాలు చేపట్టిన బ్రిటిష్ సర్కారు ఇంత ఉదారంగా మారిందా అని అనుకున్నవారూ లేకపోలేదు. బయటెంత ఆశ్చర్యం వ్యక్తమైందో... ఆంగ్లేయ సర్కారులోనూ అంతే ఆశ్చర్యం? రాజద్రోహ నేరం ఎటు పోయింది? ఎలా మాయమైంది? అని తర్జనభర్జన పడ్డారు. చివరకు... పొరపాటున 113 సెక్షన్ తొలగిపోయిందని గుర్తించారు. కమిటీ తొందరపాటు కారణంగా దీన్ని చేర్చలేకపోయామని ఆంగ్లేయ అధికారులు అంగీకరించారు.
ఫలితంగా... 1870 ప్రత్యేక చట్టం ద్వారా ఐపీసీకి సవరణ తీసుకొచ్చి... 124ఏ సెక్షన్ కింద ఈ రాజద్రోహాన్ని చేర్చారు. ఒకవేళ ఈ సెక్షన్ లేకుంటే... రాజద్రోహ నేరానికిగాను... ఇంగ్లాండ్‌లోని ఇతర చట్టాల కింద మరింత కఠిన శిక్ష విధించే అవకాశం ఉంటుందని.. ఆ ప్రమాదం నుంచి ఈ 124ఏ కాపాడుతుందని ఆంగ్లేయ సర్కారు సమర్థించుకుంది. భావప్రకటన స్వేచ్ఛకు ఈ 124ఏ ఉపయోగపడుతుందని వాదించింది. ప్రభుత్వానికి బద్ధులై, విశ్వాసపాత్రులై ఉన్నంతవరకూ ఎవరైనా తమ గళం వినిపించటానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత జాతీయోద్యమం తీరు మారిన కొద్దీ... రాజకీయ అసమ్మతిని అణచి వేయటానికి వీలుగా... ఈ 124ఏ సెక్షన్‌కు మార్పులు చేర్పులు చేస్తూ... వెళ్లింది ఆంగ్లేయ సర్కారు. 1907లో అనుమతి లేకుండా బహిరంగ సభ ఏర్పాటు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని తేల్చింది. తిలక్, గాంధీజీలపైనే కాకుండా అనేకమంది సామాన్యులపై రాజద్రోహ నేరం మోపి సతాయించింది.
రాజ్యాంగ సభలోనూ వ్యతిరేకత
స్వాతంత్య్రానంతరం కూడా భారత రాజ్యాంగంలో రాజద్రోహం పదాన్ని చేర్చటానికి ప్రతిపాదించారు. రాజ్యాంగ ముసాయిదా ప్రతిలో దీన్ని చేర్చారు. ప్రాథమిక హక్కులపై రాజ్యాంగసభలో చర్చ సందర్భంగా సోమనాథ్ లాహిరి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి నిబంధనలు పెడితే... ఒక చేత్తో భావ ప్రకటన స్వేచ్ఛనిస్తూనే మరో చేత్తో లాక్కున్నట్లవుతుందని విమర్శించారు. మరో సభ్యుడు కె.ఎం.మున్షి కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మొత్తం మీద... రాజద్రోహం పదం లేకుండా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం... నేరశిక్షాస్మృతిలోని 124ఏ సెక్షన్‌ను తొలగించాలని ప్రధాని నెహ్రూ సహా నాయకులంతా కోరారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం... రాజ్యాంగ తొలి సవరణ ద్వారా ఈ రాజద్రోహం నేరాన్ని మరింత బలోపేతం చేయటం గమనార్హం!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rishabh Pant : సూపర్ రిషభ్.. నువ్వొక ఎంటర్టైన్ క్రికెటర్‌వి
-
Politics News
Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
-
Politics News
Sanjay Raut: నాకూ గువాహటి ఆఫర్ వచ్చింది..!
-
Business News
Billionaires: కుబేరులకు కలిసిరాని 2022.. 6 నెలల్లో ₹1.10 కోట్ల కోట్లు ఆవిరి
-
Sports News
MS DHONI: రూ.40తో చికిత్స చేయించుకున్న ధోనీ.. ఎందుకో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన