Telangana Elections: చట్టాన్ని, ఈసీని కాంగ్రెస్‌ బేఖాతరు చేస్తోంది: భారాస

ఎన్నికల నియమావళిని కాంగ్రెస్‌ ఉల్లంఘిస్తోందని సీఈవో వికాస్‌ రాజ్‌కు భారాస ఫిర్యాదు చేసింది.

Updated : 20 Nov 2023 19:56 IST

హైదరాబాద్‌: చట్టాన్ని, ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌ పార్టీ బేఖాతరు చేస్తోందని భారాస (BRS) ఆరోపించింది. ఈ మేరకు భారాస ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. (Telangana Elections) అనంతరం భారాస లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల నియమావళిని కాంగ్రెస్‌ (Congress) ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఉల్లంఘనలపై సీఈవోకు నాలుగు ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని సీఈవో హామీ ఇచ్చారన్నారు. ‘‘హింసను ప్రేరేపించేలా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అనుమతులు లేకుండా సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. రేవంత్‌ రెడ్డి, సునీల్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డిని ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టాలి’’ అని సీఈవోను కోరినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని