icon icon icon
icon icon icon

Andhra news: తెదేపా ఏజెంట్లపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం: డీఐజీ విజయరావు

 వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు పోలింగ్‌ కేంద్రాన్ని కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు పరిశీలించారు.

Updated : 13 May 2024 16:20 IST

కడప: వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు పోలింగ్‌ కేంద్రాన్ని కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 
‘‘కర్నూలు, కడప జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. మైదుకూరులో తెదేపా ఏజెంట్లపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తాం. పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలు మోహరించాయి. కడప జిల్లాలో జరిగిన గొడవలపై ఆ జిల్లా ఎస్పీ పరిశీలిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు మోహరించినా కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. క్యూలైన్లలో జరిగిన గొడవల్లో పోలీసుల తప్పిదం ఉందని తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి’’ అని డీఐజీ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img