Telangana Elections: ఆఖరి వారం అగ్రనేతలంతా రాష్ట్రంలోనే
ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తార స్థాయికి తీసుకెళ్లనున్నారు.
24 నుంచి ప్రధాన పార్టీల జాతీయ నేతల ప్రచారం
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో ఆఖరి ఘట్టం అదిరిపోనుంది. వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తనుంది. ప్రధాని సహా జాతీయ నేతలు, రాష్ట్ర కీలక నాయకులు అంతా ప్రచారాన్ని తార స్థాయికి తీసుకెళ్లనున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం భాజపా, కాంగ్రెస్, భారాస, వామపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. భాజపా అగ్రనేతలు నరేంద్రమోదీ, అమిత్‌షా, జె.పి.నడ్డా; కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జునఖర్గే; భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీపీఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, బృందాకారాట్ సహా పలువురు ముఖ్యుల ప్రచారానికి పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్లుగా భాజపా, కాంగ్రెస్ జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 23తో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో వారు తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొంటారు. చివరి మూడు రోజులు రాజకీయ పార్టీలు హైదరాబాద్‌పై దృష్టి పెట్టాయి. బహిరంగసభలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి.
25 నుంచి 27 వరకు ప్రధాని మోదీ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 25న రాష్ట్రానికి వచ్చే ఆయన 27 వరకు ఇక్కడే ఉంటూ సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. 25న కామారెడ్డి, మహేశ్వరం; 26న తూప్రాన్, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రచారం 24, 26, 28 తేదీల్లో ఉంటుంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత్‌బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు.
24 నుంచి రాహుల్ ఇక్కడే
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక 24 నుంచి 28 వరకు ఇరవైకి పైగా సభల్లో పాల్గొంటారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పర్యటించే పది నియోజకవర్గాలను పార్టీ ఖరారు చేసింది. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. రాహుల్ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండనున్నారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు లేదా నాలుగు రోజులు సభలు, ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు.
సీపీఎం జాతీయ నేతలు
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారాట్, సుభాషిణి అలీ, విజయరాఘవన్ ఇతర ముఖ్యనేతలు 25, 26, 27 తేదీల్లో పూర్వపు నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొంటారు.
గజ్వేల్ సభతో ప్రచారం ముగించనున్న సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ 25న హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. 28న వరంగల్, గజ్వేల్ బహిరంగసభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.
జనసేన, భాజపా అభ్యర్థులకు మద్దతుగా పవన్‌కల్యాణ్
జనసేన, భాజపా అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బుధవారం నుంచి సభల్లో పాల్గొంటారు. ఆ సభల్లో వరంగల్ వెస్ట్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక, తాండూరు ఉన్నాయి. 26న కూకట్‌పల్లి నియోజకవర్గంలో అమిత్‌షాతో కలిసి రోడ్‌షోలో పాలుపంచుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ts Elections: ఎన్నికల ఫలితాలు సర్వేలకు అందని విధంగా ఉంటాయి: ఈటల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వేలకు అందని విధంగా ఉంటాయని భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. -
Exit polls: భాజపా ఖాతాలోకి రాజస్థాన్.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ!
Exit poll 2023: రాజస్థాన్‌లో భాజపా.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. -
Revanth reddy: కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చు: రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు నుంచే సంబరాలు చేసుకోవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. -
KTR: హ్యాట్రిక్ కొడతాం..70కి పైగా స్థానాలతో అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్
70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
TS Exit polls: తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌కే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!
తెలంగాణలో పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. -
Telangana Elections: ముగిసిన పోలింగ్ సమయం.. సాయంత్రం 5 గంటలకు 63.94 శాతం
తెలంగాణలో సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
Exit Poll Predictions: ముగిసిన పోలింగ్ సమయం.. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
Exit Poll Predictions: మరి కాసేపట్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. -
TS Elections: స్వల్ప ఘటనలు మినహా తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. -
TS Elections: తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగిసింది. -
Telangana Elections: పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు 51.89శాతం
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) కొనసాగుతోంది. -
Telangana Elections: గులాబీ కండువాతో ఓటు.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై కేసు
భారాస అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (Indrakaran Reddy)పై కేసు నమోదైంది. (Telangana Elections 2023) ఎల్లపెల్లిలో గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు. -
Bhadradri kothagudem: డబ్బులు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొందరు మహిళలు ముట్టడించారు. -
Telangana Elections: పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 36.68 శాతం
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ (Telangana Elections 2023) కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుమారు 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. -
KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు
భారాస అధినేత, సీఎం కేసీఆర్ (KCR) ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Telangana Elections 2023) తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లిన సీఎం.. అక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. -
Telangana Elections: అర్బన్ ఏరియాల్లో నెమ్మదిగా పోలింగ్: సీఈవో వికాస్‌రాజ్
కొన్నిచోట్ల స్వల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ (Telangana Elections 2023) ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. -
TS Polling: 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా 11 గంటల వరకు సుమారుగా 20.64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
Hyderabad: ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం
తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) పోలింగ్ కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. -
Telangana Elections: గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు (Telangana Elections 2023). భారాస (BRS) కండువాతో పోలింగ్ కేంద్రానికి ఆయన వచ్చారు. -
KTR: విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలి: కేటీఆర్
తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. -
TS Polling: 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8.52శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
Revanth Reddy: తెలంగాణ సెంటిమెంట్‌తో లబ్ధికి కేసీఆర్ పన్నాగాలు: రేవంత్
తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని ఎన్నికల్లో (Telangana Elections 2023) లబ్ధికి సీఎం కేసీఆర్ (KCR) పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.


తాజా వార్తలు (Latest News)
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ
-
Nimmagdda Ramesh: ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు.. ఏపీ ప్రజలకు నిమ్మగడ్డ కీలక సూచన
-
Social Look: వాణీ కపూర్ ‘పిల్లో టాక్’.. తేజస్విని ‘కెమెరా’ స్టిల్!
-
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు