Telangana assembly elections: ప్రచార పంథా.. కృత్రిమ మేధ
ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గ్రేటర్లో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 2.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఓటర్లు ఉంటారు. అన్ని కాలనీలు, బస్తీలు తిరుగుతూ ఓటర్లను కలవడం అయ్యే పనికాదు.
ఈనాడు, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గ్రేటర్లో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 2.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఓటర్లు ఉంటారు. అన్ని కాలనీలు, బస్తీలు తిరుగుతూ ఓటర్లను కలవడం అయ్యే పనికాదు. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు ఎన్ని పెట్టినా ఎన్నికల నాటికి ఇంకా తిరగని ప్రాంతాలు మిగిలే ఉంటాయి. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమే. ఇప్పటికే భారాస రాష్ట్ర నేతలను, కాంగ్రెస్, భాజపా జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నాయి. దీంతోపాటు సాంకేతిక దన్నుతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నేరుగా అభ్యర్థులు ఫోన్లకు వాయిస్ మెసేజ్ రూపంలో కాల్స్‌చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులుగా ఉంటున్న వారికి కూడా ఈ తరహా కాల్స్ చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. దాంతోపాటు ఏరోజుకారోజు కార్నర్ మీటింగ్‌లు జరిగే ప్రాంతాల గురించి ఫోన్లో చెబుతూ హాజరు కావాలని కోరుతున్నారు. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ తరహా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఏఐ టూల్ తయారు చేసి
ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)ను కొందరు ఎన్నికల ప్రచారంలో తెరపైకి తెస్తున్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఓ స్వతంత్ర అభ్యర్థి తన ప్రచారంలో ఈ ఏఐ సాంకేతికతను వినియోగిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఏఐ టూల్‌ను తయారు చేసి ఆ ప్రాంతంలోని ఓటర్ల వాట్సాప్ నంబర్లకు పంపుతున్నారు. అది ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే...అభ్యర్థి పూర్తి వివరాలు ఓటర్లకు అందుబాటులో ఉంటాయి. అక్కడే చాటింగ్ ద్వారా అభ్యర్థికి పలు ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. మిషన్ లెర్నింగ్‌తో ముందే కొన్ని కామన్ ప్రశ్నలకు జవాబులు రూపకల్పన చేసి అందులో ఉంచారు. సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్ట పడుతుంటారు. అయితే రాజకీయ నేపథ్యం, డబ్బు లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి సాంకేతికతతో అతి తక్కువ వ్యయంతో ప్రచారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏఐ ద్వారా ఒక్కో ఓటర్‌కు సమాచారం పంపడానికి 80 పైసలు కంటే ఎక్కువ కాదు. భవిష్యత్తులో అభ్యర్థులు ప్రచార వ్యయం తగ్గించుకోవడానికి.. ఇదో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Elections: తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలు ఆపండి: ఈసీ
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా అమలు చేస్తున్న పథకాల గురించి తెలంగాణ వార్తా పత్రికల్లో ఎన్నికల ప్రకటనలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఆదేశించింది. -
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటూ.. అఫిడవిట్లు!
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసే పూర్తి బాధ్యతలను తామే తీసుకుంటామని.. జిల్లాలోని ఆ పార్టీ మూడు నియెజకవర్గాల అభ్యర్థులు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. -
కేసీఆర్ ఖేల్ ఖతం
‘ప్రస్తుత ఎన్నికలతో భారాస ఆట ముగియనుంది. మొదటిసారి తెలంగాణలో భాజపా ప్రభుత్వం రాబోతోంది. హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ ట్రైలర్ చూశారు. -
KCR: వచ్చేది మా సర్కారే
మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని.. డిసెంబరు 6న రైతుబంధు నగదు యథావిధిగా పడుతుందని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. -
భారాసకు మళ్లీ అవకాశమిస్తే భూముల లూటీ
దేశంలోనే ధనిక పార్టీగా భారాస మారిందని.. ఆ పార్టీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ అన్నారు. -
హరీశ్, కేసీఆర్‌ల వల్లే రైతుబంధు ఆగింది
‘రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము వేయాలని మేము ఎన్నికల సంఘానికి ఎప్పుడో విజ్ఞప్తి చేశాం. నిన్నగాక మొన్న అనుమతి ఇచ్చింది. -
ప్రజలు మార్పు కోసం ఓటేయబోతున్నారు
మార్పు కోసమే ప్రజలు ఓటు వేయబోతున్నారని కేంద్ర మాజీమంత్రి, రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. -
మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాం..
తెలంగాణ ఏర్పడ్డాక ఒకే కుటుంబం పాలిస్తూ వస్తోందని, సంపాదన, పదవుల కోసమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పీసీసీ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. -
ఉచిత విద్యుత్తు పేటెంట్ కాంగ్రెస్‌దే
ఉచిత విద్యుత్తు పేటెంట్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని సీఎల్పీ నేత, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. -
గిగ్ వర్కర్స్కు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు
స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, డంజో తదితర సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్స్, డెలివరీ బాయ్స్ వేతనాలు, సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. -
ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుంపటిగా మార్చారు: జైరాం రమేశ్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ప్రజలకు కేసీఆర్ ద్రోహం చేశారని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. -
ఒక్కఛాన్స్ ఇచ్చేందుకు కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు
రైతుబంధుకు ఎన్నికల సంఘం అనుమతిస్తే.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసి అడ్డుకున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. -
ఇందిరా గాంధీని దూషిస్తున్న కేసీఆర్‌ను ఇంటికి పంపాలి
పేదలకు మేలు చేసిన ఇందిరా గాంధీ పాలనను, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని, రాహుల్ గాంధీని దూషిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. -
భారాస, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో కాంగ్రెస్, భారాసల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. -
రాష్ట్రంలో భాజపాతోనే సామాజిక న్యాయం
భాజపా హయాంలోనే దేశంలో ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలు, మహిళలకు సామాజిక న్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. -
రాష్ట్రానికి నష్టం చేసిన కాంగ్రెస్, భారాస
రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే సువర్ణావకాశం శాసనసభ ఎన్నికలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. -
కదులుతున్న నోట్ల కట్టలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడే సమయం ఆసన్నమైంది. ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్, భాజపాలు తమ బలాలు, బలగాల్ని మోహరించి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. -
రాజధానిలో మార్మోగిన మోదీ నినాదం
హైదరాబాద్ నగరంలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్‌షోలో కమలదళం కదం తొక్కింది. -
అధికారం ఇవ్వండి.. అండగా ఉంటాం
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, మద్నూర్ మండలం మేనూర్‌లలో జరిగిన సభల్లో భాజపా అభ్యర్థులు యెండల లక్ష్మీనారాయణ, అరుణతారలకు మద్దతుగా బహిరంగ సభల్లో మాట్లాడుతూ భారాస, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. -
కష్టకాలంలో అండగా ఉన్నా.. ఆశీర్వదించండి
‘కరోనా కష్టకాలంలో ప్రజల వెన్నంటి ఉన్నాను.. ప్రకృతి వైపరీత్యాలు విలయతాండవం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినప్పుడు అండగా నిలిచాను.. దా -
రేపటి నుంచి ఎట్టాగబ్బా
ఎన్నికల ప్రచారాల్లో పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్‌షో, సమావేశాలతో బల ప్రదర్శనకు దిగాయి.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు
-
Rathika rose: టాప్-5లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి: రతిక
-
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Gold Saree: బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
-
Kurnool: పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు