IT Raids: మాజీ ఎంపీ వివేక్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Updated : 21 Nov 2023 12:41 IST

హైదరాబాద్‌: చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాలతో పాటు బేగంపేటలోని వివేక్‌ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయి. సోమాజిగూడలోని నివాసంలో 4 గంటల పాటు తనిఖీలు కొనసాగాయి. వివేక్‌ సంస్థల్లోకి రూ.8కోట్లు చేరాయనే అంశంపై ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మరోవైపు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లోని వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని