icon icon icon
icon icon icon

JP Nadda: భాజపాను గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయి: జేపీ నడ్డా

కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించామని, అదే మాదిరిగా తెలంగాణకూ విముక్తి కల్పిస్తామని భాజపా జాతీయ అధ్యుక్షుడు జేపీ నడ్డా అన్నారు.

Published : 23 Nov 2023 14:56 IST

నిజామాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంగా మారిందని.. ఈ పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో నడ్డా మాట్లాడారు.

‘‘తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్‌ మోసం చేశారు. దళిత బంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదు. ప్రధాని మోదీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి చేరింది. గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్నాం. కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించాం. అదే మాదిరిగా కుటుంబ పాలన నుంచి తెలంగాణకూ విముక్తి కల్పిస్తాం’’ అని నడ్డా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img