icon icon icon
icon icon icon

Nitin Gadkari: ఆ 3 రాష్ట్రాల్లో గెలుపు మాదే..: నితిన్‌ గడ్కరీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భాజపా విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.

Published : 14 Nov 2023 20:09 IST

భోపాల్‌: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ పైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది.  ఆయా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్‌ హీటు పెంచుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా భారీ హామీలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని రాజకీయ పార్టీలు విశ్వాసం వ్యక్తంచేస్తున్న వేళ కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కచ్చితంగా భాజపా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణలో తమకు సీట్లు పెరుగుతాయని.. మిజోరంలోనూ మంచి ఫలితాలే వస్తాయని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌ అనుకూల తుపాను రాబోతోంది.. 150 సీట్లు ఖాయం: రాహుల్‌

ఈ నెల 17న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో భాజపా అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పైవిధంగా గడ్కరీ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇప్పటికే మిజోరం అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఈ నెల 17న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో మలి విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 25న రాజస్థాన్‌, నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img