icon icon icon
icon icon icon

Sunitha: కడప జిల్లా ప్రజల తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుంది: సునీత

ఈ ఎన్నికల్లో కడప జిల్లా ప్రజల ఇచ్చే తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత అన్నారు.

Published : 11 May 2024 16:25 IST

కడప: ఈ ఎన్నికల్లో కడప జిల్లా ప్రజల ఇచ్చే తీర్పు చిరస్థాయిగా నిలిచిపోతుందని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత అన్నారు. శనివారం సాయంత్రం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పులివెందుల, కడప ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం న్యాయాన్ని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి ప్రజల కోసం 30.. 40 సంవత్సరాలు పని చేశారని గుర్తు చేశారు.

‘‘మాకు న్యాయం జరగాలని అందరి మనస్సుల్లో ఉంది. హస్తం గుర్తుకు ఓటు వేసి న్యాయాన్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చూసి భావోద్వేగానికి గురయ్యా. మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నా. ఇది న్యాయ పోరటం.. ప్రజలందరూ న్యాయ పోరాటం వైపే ఉన్నారు. వైఎస్‌  విజయమ్మ కూడా న్యాయం వైపే ఉన్నారు. పార్టీలకతీతంగా మాకు మద్దతివ్వాలి. కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారని జూన్‌ 4న ప్రపంచానికి తెలుస్తుందని నమ్ముతున్నా’’ అని సునీత తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img