Telangana Elections: 33 జిల్లాల్లో 49 కేంద్రాలు.. ఓట్ల లెక్కింపు జరిగేది ఇక్కడే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును మొత్తం 49 కేంద్రాల్లో చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. రాజధాని హైదరాబాద్‌లో ఎక్కువ సంఖ్యలో 14 లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. మిగిలిన 13 నియోజవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాల్లో జిల్లాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు, నియోజకవర్గాలు ఇలా..
- ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్ (సిర్పూర్, ఆసిఫాబాద్)
- అజీజియా ఇంజినీరింగ్ కళాశాల, మంచిర్యాల (చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల)
- టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్‌మెంట్ సెంటర్, ఆదిలాబాద్ (ఆదిలాబాద్, బోథ్)
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్ (ఖానాపూర్, నిర్మల్, ముథోల్)
- ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్, నిజామాబాద్ (ఆర్మూర్, బాన్స్‌వాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ)
- ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, నిజామాబాద్ (బోధన్)
- ఏఎంసీ గోడౌన్, కామారెడ్డి (జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి)
- వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాల, జగిత్యాల (కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి)
- జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, మంథని (రామగుండం, మంథని, పెద్దపల్లి)
- ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల, కరీంగనగర్ (కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్)
- ఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, సిరిసిల్ల (వేములవాడ, సిరిసిల్ల)
- గీతం యూనివర్సిటీ (నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు)
- వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హవేలీఘనపూర్ (మెదక్, నర్సాపూర్)
- ఇందూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్దిపేట (హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్)
- సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఇబ్రహీంపట్నం (ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి)
- సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం (ఎల్బీనగర్)
- లార్డ్స్ ఇంజినీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్ (రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్‌నగర్)
- బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి (శేరిలింగంపల్లి)
- ఏఎంసీ గోడౌన్, పరిగి (పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్)
- హోలీమేరి ఇంజినీరింగ్ కళాశాల, కీసర (మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్)
- ఏవీ కళాశాల, దోమల్‌గూడ (ముషీరాబాద్)
- ఇండోర్ స్టేడియం, అంబర్‌పేట (మలక్ పేట)
- రెడ్డి ఉమెన్స్ కళాశాల, నారాయణగూడ (అంబర్ పేట)
- కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసఫ్‌గూడ (ఖైరతాబాద్, జూబ్లీహిల్స్)
- కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఓయూ (సనత్‌నగర్)
- జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్ (నాంపల్లి)
- ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్ (కార్వాన్)
- తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోటి (గోషామహల్)
- కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లి (చార్మినార్)
- నిజాం కళాశాల, బషీర్ బాగ్ (చాంద్రాయణగుట్ట)
- సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయ, నాంపల్లి (యాకుత్‌పుర)
- అరోరా కళాశాల, బండ్లగూడ (బహదూర్‌పుర)
- డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ (సికింద్రాబాద్)
- వెస్లీ కళాశాల, సికింద్రాబాద్ (కంటోన్మెంట్)
- శ్రీదత్త బృందావన్ ఇనిస్టిట్యూట్, సింగారం (నారాయణపేట, మక్తల్)
- జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, మహబూబ్‌నగర్ (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర)
- ఏఎంసీ గోడౌన్, నాగర్ కర్నూల్ (నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్)
- ఏఎంసీ గోడౌన్, చిట్యాల (వనపర్తి)
- ప్రభుత్వ పాలిటెక్నిక్, గద్వాల (గద్వాల, అలంపూర్)
- వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్, దుప్పలపల్లి (దేవరకొండ, నాగార్జున్ సాగర్, మిర్యాలగూడ, నల్గొండ, మునుగోడు, నకిరేకల్)
- ఏఎంసీ గోడౌన్, సూర్యాపేట (హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగుతుర్తి)
- ఆరోరా అకాడమీ, రాయిగిరి (భువనగిరి, ఆలేరు)
- విద్యాభారతి ఇనిస్టిట్యూట్, పెంబర్తి (జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి)
- ఎస్సీ బాలికల గురుకుల కళాశాల, మహబూబాబాద్ (డోర్నకల్, మహబూబాబాద్)
- ఏఎంసీ గోడౌన్, ఎనుమాముల (నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట)
- సీఈఆర్ క్లబ్, భూపాలపల్లి (భూపాలపల్లి)
- జిల్లా కలెక్టర్ కార్యాలయం, ములుగు (ములుగు)
- అనుబోస్ ఇనిస్టిట్యూట్, పాల్వంచ (పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం)
- శ్రీచైతన్య కళాశాల, పొన్నేకల్ (ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
congress: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. సోమవారం సీఎల్పీ సమావేశం
కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ అందజేశారు. -
Election Results: అహంకార కూటమికి.. ఇదో హెచ్చరిక: ప్రధాని మోదీ
మూడు రాష్ట్రాల్లో భాజపా విజయం.. ‘ఘమండియా (అహంకారపూరిత)’ కూటమికి స్పష్టమైన హెచ్చరిక అని ‘ఇండియా’ కూటమిని ఉద్దేశించి ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
Assembly Election Results: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. సీఎంలు ఏమన్నారంటే?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వివిధ రాష్ట్రాల సీఎం తమ స్పందించారు. విజేతలకు శుభాకాంక్షలు చెప్పారు. -
Revanth reddy: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం?
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. -
భార్యాభర్తలు, మామా అల్లుళ్ల గెలుపు.. ఆ పార్టీ ఎంపీలంతా ఓటమి!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర సంగతులు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు ఇవీ.. -
Telangana DGP: తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియామకం
తెలంగాణ డీజీపీగా రవిగుప్తా నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
Ashok Gehlot: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ,: అశోక్ గహ్లోత్
గత ఐదేళ్లలో రాజస్థాన్‌లో తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్‌ను మరోసారి గెలిపిస్తాయని భావించామని, కానీ, వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు. -
Kishan Reddy: భాజపా ఓటు బ్యాంక్ 100 శాతం పెరిగింది: కిషన్‌రెడ్డి
ప్రజా తీర్పు గౌరవిస్తున్నామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. -
TS Results: ‘కారు’కు నిరాశ.. ఆరుగురు మంత్రులకు షాక్
TS election results: తెలంగాణ ఎన్నికల్లో భారాసకు అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చోట ఓటమి పాలవ్వగా.. మంత్రులుగా వ్యవహరించిన వారూ ఓటమి పాలయ్యారు. -
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా.. ఆమోదించిన గవర్నర్
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. -
Rajasthan Election Result: రాజస్థాన్‌లో భాజపా విజయం.. సీఎం రేసులో ఎవరెవరు?
రాజస్థాన్‌లో భాజపా అధికారంలోకి వచ్చింది. అయితే, అక్కడ ఎవరిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మాజీ సీఎం వసుంధరా రాజేతోపాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. -
Revanth Reddy: హస్తానికి జీవం పోసి.. అధికారానికి చేరువ చేసి..! రేవంత్ ప్రస్థానమిది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని సాధించి పెట్టడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిది కీలక పాత్ర. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే.. -
TS Elections: అంతటా కాంగ్రెస్ హవా.. హైదరాబాద్‌లో డీలాకు కారణమిదేనా?
తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో కాంగ్రెస్ తన హవా కొనసాగించినా జంటనగరాల పరిధిలో మాత్రం డీలా పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భాజపా భారీగా చీల్చటంతో ఆ ప్రభావం కాంగ్రెస్‌పై పడింది. -
TS Elections - BJP: తెలంగాణలో గతంకంటే పుంజుకున్న భాజపా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఈసారి పుంజుకుంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైనప్పటికీ.. గతంలో కంటే ఈసారి ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంది. -
KTR: ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరిస్తాం: కేటీఆర్
ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
TS Elections: ఓటర్ల విలక్షణ తీర్పు.. ఉప ఎన్నిక తప్పించింది!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారని చెప్పడానికి గజ్వేల్, కామారెడ్డి, హుజూరాబాద్ ఫలితాలే నిదర్శనం. -
MP election results: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ ప్రజల హృదయాల్లో ఉన్నారు..
MP election results: మధ్యప్రదేశ్‌లో భాజపా విజయంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే తాము గెలిచామని చెప్పారు. -
Rahul Gandhi: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. రాహుల్ గాంధీ స్పందన ఇదే!
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు. -
DGP Anjani Kumar: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసిన ఈసీ
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. -
Assembly election Results: మూడు రాష్ట్రాల ఫలితాలు.. ప్రముఖుల గెలుపోటములు ఇలా..!
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా హవా కనిపిస్తోంది. ఈ ఎన్నికలు పలు ప్రముఖ నేతల భవితవ్యాన్ని నిర్ణయించాయి. -
Chhattisgarh Election Results: ఛత్తీస్‌గఢ్‌లో మోదీ మ్యాజిక్‌తో భాజపా జోరు
Chhattisgarh Election Results: తాజాగా వెలువడ్డ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా మూడింట్లో స్పష్టమైన మెజారిటీ దక్కించుకుంది. అందులో ఛత్తీస్‌గఢ్ కూడా ఒకటి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌వైపే మొగ్గుచూపినప్పటికీ.. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.


తాజా వార్తలు (Latest News)
-
Germany: మ్యూనిచ్ ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం.. మంచులో చిక్కుకుపోయిన విమానాలు..!
-
congress: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. సోమవారం సీఎల్పీ సమావేశం
-
Election Results: అహంకార కూటమికి.. ఇదో హెచ్చరిక: ప్రధాని మోదీ
-
IND vs AUS: విజయం కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Assembly Election Results: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. సీఎంలు ఏమన్నారంటే?