విపణిలోకి బజాజ్‌ ప్లాటినా 100 కేఎస్‌

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్, ‘ప్లాటినా 100 కేఎస్’‌ వేరియంట్‌ బైక్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ ధరను రూ.51,667(ఎక్స్‌ షోరూం)గా సంస్థ నిర్ణయించింది. బీఎస్‌ 6 ప్రమాణాలతో ఈ బైక్‌ రూపొందించారు.

Published : 30 Dec 2020 15:56 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ బజాజ్, ‘ప్లాటినా 100 కేఎస్’‌ వేరియంట్‌ బైక్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ ధరను రూ.51,667(ఎక్స్‌ షోరూం)గా సంస్థ నిర్ణయించింది. బీఎస్‌ 6 ప్రమాణాలతో ఈ బైక్‌ రూపొందించారు. దేశంలోని అన్ని బజాజ్‌ డీలర్ల వద్ద ఈ మోడల్‌ ద్విచక్రవాహనాల బుకింగ్స్‌ అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది జులైలో సంస్థ విడుదల చేసిన ప్లాటినా ఈఎస్‌(ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌)తో పోలిస్తే ప్లాటినా కేఎస్‌ ధర రూ.7,700 తక్కువకు లభించనున్నట్లు సంస్థ తెలిపింది.

ప్లాటినా 100 కేఎస్‌ బైక్‌ను 102సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో రూపొందించింది. ఇది 7,500 ఆర్‌పీఎం వద్ద గరిష్ఠంగా 7.77బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు 4 గేర్‌ బాక్స్‌ అమర్చారు. ఈ బైక్‌ గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనికి రెండు చివర్లలో డ్రమ్‌ బ్రేక్‌ సిస్టమ్‌ అందిస్తున్నారు. ఈ మోడల్‌ ప్రయాణికులకు సౌకర్యం విషయంలో ఉత్తమ బైక్‌గా నిలిచిందని బజాజ్‌ సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ నారాయణ్‌ సుందరం తెలిపారు. గత 15 సంవత్సరాల్లో 72లక్షల ప్లాటినా మోటార్‌ సైకిళ్లు విక్రయించినట్టు వెల్లడించారు.  

ఇదీ చదవండి

కొత్త గ్యాడ్జెట్‌: పరిగెత్తే అలారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని